About తెలుగు

శ్రీ గురుదత్త!
శ్రీ మాతా! ముందు మాట

ప్రియ పాఠకులైన అయ్యా/అమ్మా,
నమస్సులు! శుభాకామనలు!
బ్లిస్ గీత (సచ్చిదానంద గీత) ను తెలుసుకోవాలనే మీ ఆసక్తికి
కృతజ్ఞతలు! సచ్చిదానంద పూర్ణమైన సచ్చిదానంద గీత
(బ్లిస్ గీత) కు మీకు స్వాగతం!
నా అభిప్రాయాలను మీతో స్వేచ్ఛగా పంచుకోవాలని అనుకుంటున్నాను.

యువతకు నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
నైపుణ్యాభివృద్ధి (కౌశల్యాభివృధ్ధి) ని చేపట్టడం అభినందనీయం!

ప్రతీ యేటా వేలాది మంది యువతీ యువకులు పట్టభద్రులై కళాశాలల నుండి బయటకి వస్తున్నారు. కానీ వారందరూ ఉద్యోగాలు పొందలేక పోతున్నారు.

అయితే, వారికి ఉద్యోగాలు ఇచ్చే సంస్థల వాళ్ళు – వారికి డిగ్రీలు వున్నాయి గానీ, మాకు అవసరమైన ఉద్యోగ నైపుణ్యాలు, జీవన నైపుణ్యాలు, తదితర యోగ్యతలు వారికి లేవు – అని అంటున్నారు.

కాబట్టి, నేటి విద్యార్థులకూ, యువతకూ నైపుణ్యాభివృద్ధి లక్ష్యం కావాలి.
కౌశల్యాభివృధ్ధి తోబాటు
అంకుర సంస్థలు, స్వయం ఉపాధి, స్వీయ వ్యాపారావకాశాలపై కూడా అవగాహన కలిగించి, ప్రభుత్వాలు మార్గదర్శకాలు ఇవ్వాలి!

అంతే కాకుండా, మరీ ముఖ్యంగా, విశ్వ మానవతా విలువలు నేర్పించాలి. ఇది తక్షణ కర్తవ్యం!

భగవద్గీత లో యోగం దృష్ట్యా కౌశల్యాభివృధ్ధి ప్రస్తావన వుంది: 2వ అధ్యాయం-సాంఖ్య యోగం లోని 50వ శ్లోకం లో 4వ పాదం: యోగః కర్మసు కౌశలమ్ – అంటే, పనులు చేయడంలో కౌశల్యం /సామర్థ్యం / నైపుణ్యమే యోగం!

ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసిటిఇ) వారూ మరియు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) వారూ వారి యొక్క సంస్థలకు ప్రేరణ వాక్యంగా “యోగః కర్మసు కౌశలమ్” ను తీసుకున్నారు.

ఇప్పుడు మనం, ప్రపంచశాంతి కి విఘాతం కలిగిస్తున్న కొన్ని సవాళ్ళను చూద్దాం!

యుద్ధం, దోపిడీ, మాదకద్రవ్యాలు, మహిళలపై అత్యాచారాలు, అనైతిక అక్రమ రవాణా, చిన్నారులపై అమానుష అఘాయిత్యాలు, ఆత్మహత్యలు,
పేదరికం, ఆకలి, పౌష్టికాహార లోపం, అవినీతి, కల్తీ, ఉగ్రవాదం, వ్యాధి భయం, వైరస్-అంటు వ్యాధులు, కరోనా మహమ్మారి వంటి ఎన్నో సవాళ్ళను నేడు ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్నది.

అవన్నీ పరిష్కరించబడితేనే, ప్రపంచశాంతి కి మార్గం సుగమం అయ్యేది.

అందుకు మనమేం చేయాలో చూద్దాం!

భగవంతుడైన శ్రీకృష్ణుడు భగవద్గీత లో 4వ అధ్యాయం-జ్ఞానయోగం లో – 7,8 శ్లోకాలలో తన యొక్క అవతరణ గురించి ఇలా చెప్పాడు – లోకంలో ధర్మగ్లాని ఏర్పడినప్పుడు,
తాను స్వయంగా అవతరించి ధర్మ సంస్థాపన చేస్తుంటానని చెప్పాడు.

అయితే, భగవానుడు ధర్మరక్షణ చేయడం తోబాటు, మనం కూడా ధర్మరక్షణ చేయవలసిన సామాజిక బాధ్యత మనపై వున్నది.

ధర్మో రక్షతి రక్షితః – అనేది వేదోక్తి! అయితే ధర్మాన్ని మనం రక్షించడం అంటే, ధర్మాన్ని మనం ఆచరించడం అని అర్థం.
సత్యంవద ధర్మంచర అంటారు గదా!

అసలు ఇతర ప్రాణుల నుండి మనిషిని వేరు చేస్తున్న లక్షణం (గుణం) ధర్మమే కదా! ధర్మమే విశ్వశాంతిని పరిరక్షించే పరమ సాధనం!! శాశ్వత సూత్రం!!!

ప్రపంచంలో శాంతిసామరస్యాలు
నెలకొల్పడానికి ధర్మసంస్థాపనే
ఏకైక పరిష్కారం!

ఈ సందర్భంగా, గౌరవనీయులైన మన పూర్వ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం గారు యూరోపియన్ పార్లమెంట్ లో చెప్పిన మాటలు ప్రస్తావించడం ఎంతైనా సముచితం:

ప్రపంచంలో నేటి కల్లోల పరిస్థితుల్లో ఇప్పుడు మనకు వుండవలసిన ఒక గొప్ప గుణం (లక్షణం) ఏమిటంటే – ‘ధర్మము!’ మానవ ప్రవర్తన లోని పరిపూర్ణత్వానికీ, నిత్యమైన
మంచితనానికీ వాహకమైనది – ‘ధర్మం!’

ఏ హృదయంలో అయితే ధర్మం వుంటుందో-ఆ వ్యక్తి ప్రవర్తనలో సౌందర్యం వుంటుంది,
ఎప్పుడైతే ప్రవర్తన లో సౌందర్యం వుంటుందో-ఆ గృహంలో సామరస్యం వుంటుంది,
ఎప్పుడైతే గృహంలో సామరస్యం వుంటుందో-దేశంలో శాంతి భద్రతలుంటాయి, ఎప్పుడైతే దేశంలో శాంతి భద్రతలుంటాయో- ప్రపంచంలో శాంతి పరిఢవిల్లుతుంది.

కాబట్టి ప్రపంచశాంతికి
అసలు మూలం ధర్మమే!

కార్య-కారణ సంబంధంలో,
ప్రపంచశాంతి కార్యమైతే,
ధర్మం కారణం అవుతుంది.

పై మాటలను పరిశీలిస్తే,
ముందు, మనిషి హృదయంలో ధర్మం వుంటే – ప్రపంచశాంతి కి సరియైన మార్గం ఏర్పడుతుంది – అని మనకు అర్థమవుతున్నది!

అందువలన, మానవ ప్రవర్తన లో ధర్మాన్ని ప్రతిష్ఠించడమే ప్రపంచశాంతికి అసలైన పరిష్కారం!

ఈ నేపథ్యంలో, తత్వవేత్త అయిన మన దేశ ప్రథమ ఉపాధ్యక్షుడు & ద్వితీయ అధ్యక్షుడు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ (సెప్టెంబర్ 5న ఆయన పుట్టినరోజు ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం) గారి మాటలు గుర్తుకొస్తున్నాయి: అసలు, విద్య యొక్క ముఖ్య ఉద్దేశం/అంతిమ లక్ష్యం – ఒక గొప్ప మనిషిని తయారు చేయడం. స్వేచ్చ, సృజనాత్మకత గల ఆ మనిషి – ప్రకృతి వైపరీత్యాలనూ, చారిత్రక క్లిష్ట పరిస్థితులనూ సమర్థవంతంగా ఎదుర్కొని, ధర్మ రక్షణ చేయగలవాడై వుండాలి.

పై నేపథ్యంలో…
కె. వేంకట నాగ రాజా రావు అనబడే నేను విశ్వ శాంతి సాధన కు నిబద్ధుడనైై విద్యార్థులకూ, యువతకూ జ్ఞానోదయం కలిగిస్తూ, సాధికారత ను అందిస్తూ అంకితభావంతో
సదా సేవలందిస్తున్నాను.
జ్ఞాన సముపార్జన & జ్ఞానాన్ని పంచుకోవడం అంటే నాకు మిక్కిలి ఆసక్తి! అందులోనూ, భగవద్గీతా జ్ఞాన యజ్ఞమంటే మరీ ప్రీతి!

జగద్గురువు, అవధూత దత్త పీఠాధిపతి,
నవీన దత్తావతారమైన
పరమ పూజ్య శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు – కరోనా కల్లోల సమయంలో ప్రపంచశాంతి కోసం, అనితర సాధ్యమైన రీతిలో, విశిష్టమైన శైలిలో, శ్రీ వేదవ్యాస విరచితమైన సంపూర్ణ శ్రీ మహా భారతాన్ని, మూలం నుండీ ప్రవచించిన సందర్భంగా, కురు పాండవ యుద్ధం ప్రారంభంలో
భగవద్గీతా జ్ఞానబోధ చేస్తూ –
మనిషి జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలకూ పరిష్కారాలను ఇస్తుంది భగవద్గీత – అని అన్నారు.
అది ఒక ప్రబోధగీత!
ఆయన ఒక దివ్యజ్ఞాన గంగా ఝరి!

గొప్పదైన ఆ భగవద్గీత ఒక
ప్రశ్న తో ప్రారంభం అవుతుంది…

తదుపరి, అర్జునుడు అడిగిన
ప్రతి ప్రశ్నకీ సంతృప్తికరమైన సమాధానాలు ఇస్తూ, దివ్య
జ్ఞానాన్ని బోధించి, అర్జునుడ్ని
కర్తవ్యోన్ముఖుడ్ని చేసి, యుద్ధం చేయించి, జయం కలిగించి, ధర్మ రక్షణ, శాంతి సంస్థాపన చేశాడు – భగవానుడైన శ్రీ కృష్ణుడు.

ఇక ప్రస్తుత విషయానికి వస్తే,
బ్లిస్ గీత – నేటి యువతీ యువకులను మేల్కొలుపుతూ, వారి హృదయాలలో ధర్మమనే జ్ఞాన జ్యోతిని వెలిగిస్తూ, జయం కలిగిస్తూ, సాధికారతను ఇస్తుంది.

విద్యార్థులు నన్ను అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తూ, అన్వేషిస్తూ, ఆవిష్కరణ అయినదే బ్లిస్ గీత (సచ్చిదానంద గీత).

ఆ విధంగా, ధర్మప్రబోధంతో యువతను జాగృతం చేస్తూ, యువ హృదయాలలో ధర్మాన్ని ప్రతిష్ఠిస్తూ, ప్రపంచ శాంతి కోసం ఆవిర్భవించింది బ్లిస్ గీత (సచ్చిదానంద గీత)! ‌

నా ఈ చిరు ప్రయత్నం మీ అందరి ఆదరాభిమానాలను పొందగలదన్న నమ్మకంతో, మీ ఆశీస్సుల కోసం ప్రార్థిస్తున్నాను …

జయ గురుదత్త!

ఓం శాంతిః శాంతిః శాంతిః

ముందు మాట 

ప్రియ పాఠకులైన అయ్యా/అమ్మా,  

నమస్సులు! శుభాకామనలు!   బ్లిస్ గీత (సచ్చిదానంద గీత) ను తెలుసుకోవాలనే మీ ఆసక్తికి కృతజ్ఞతలు.  సచ్చిదానంద పూర్ణమైన సచ్చిదానంద గీత (బ్లిస్ గీత) కు మీకు స్వాగతం! 

నా అభిప్రాయాలను మీతో స్వేచ్ఛగా పంచుకోవాలని అనుకుంటున్నాను.  

యువతకు నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నైపుణ్యాభివృద్ధి (కౌశల్యాభివృధ్ధి) ని చేపట్టడం అభినందనీయం! 

ప్రతీ యేటా వేలాది మంది యువతీ యువకులు పట్టభద్రులై కళాశాలల నుండి బయటకి వస్తున్నారు. కానీ వారందరూ ఉద్యోగాలు పొందలేక పోతున్నారు. అయితే, వారికి ఉద్యోగాలు ఇచ్చే సంస్థల వాళ్ళు – వారికి డిగ్రీలు వున్నాయి గానీ, మాకు అవసరమైన ఉద్యోగ నైపుణ్యాలు, జీవన నైపుణ్యాలు, తదితర యోగ్యతలు లేవు – అని అంటున్నారు. కాబట్టి,  నేటి విద్యార్థులకూ, యువతకూ నైపుణ్యాభివృద్ధి  లక్ష్యం కావాలి. కౌశల్యాభివృధ్ధి తోబాటు అంకుర సంస్థలు, స్వయం ఉపాధి, స్వీయ వ్యాపారావకాశాలపై కూడా అవగాహన కలిగించి, ప్రభుత్వాలు మార్గదర్శకాలు ఇవ్వాలి. అంతే కాకుండా, మరీ ముఖ్యంగా,  విశ్వ మానవతా విలువలు  నేర్పించాలి. ఇది తక్షణ కర్తవ్యం కావాలి! 

భగవద్గీత లో యోగం దృష్ట్యా కౌశల్యాభివృధ్ధి  ప్రస్తావన వుంది: 2వ అధ్యాయం-సాంఖ్య యోగం లోని 50వ శ్లోకం లో 4వ పాదం: యోగః కర్మసు కౌశలమ్ – అంటే, పనులు చేయడంలో కౌశల్యం /సామర్థ్యం / నైపుణ్యమే యోగం!  ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసిటిఇ) వారూ మరియు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్  (ఐఏఎస్)  వారూ వారి యొక్క సంస్థలకు ప్రేరణా వాక్యంగా “యోగః కర్మసు కౌశలమ్” ను తీసుకున్నారు. 

ఇప్పుడు మనం, ప్రపంచశాంతి కి విఘాతం కలిగిస్తున్న కొన్ని సవాళ్ళను చూద్దాం! … యుద్ధం, మాదకద్రవ్యాలు, దోపిడీ, మహిళలపై అత్యాచారాలు, అనైతిక అక్రమ రవాణా, చిన్నారులపై అమానుష అఘాయిత్యాలు, ఆత్మహత్యలు,పేదరికం, ఆకలి, పౌష్టికాహార లోపం, అవినీతి, కల్తీ, ఉగ్రవాదం, వ్యాధి భయం, వైరస్-అంటు వ్యాధులు, కరోనా మహమ్మారి, జంతువుల పట్ల క్రూరత్వం వంటి ఎన్నో సవాళ్ళను నేడు ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్నది.

అవన్నీ పరిష్కరించబడితేనే, ప్రపంచశాంతి కి మార్గం సుగమం అయ్యేది. అందుకు మనమేం చేయాలో చూద్దాం! 

భగవంతుడైన శ్రీకృష్ణుడు భగవద్గీత లో 4వ అధ్యాయం-జ్ఞానయోగం లో – 7,8 శ్లోకాలలో తన యొక్క అవతరణ గురించి ఇలా చెప్పాడు – లోకంలో ధర్మగ్లాని ఏర్పడినప్పుడు, తాను స్వయంగా అవతరించి  ధర్మ సంస్థాపన చేస్తుంటానని చెప్పాడు. అయితే, భగవానుడు ధర్మరక్షణ చేయడం తోబాటు, మనం కూడా ధర్మరక్షణ చేయవలసిన బాధ్యత వున్నది. ధర్మో రక్షతి రక్షితః – అనేది వేదోక్తి! అయితే ధర్మాన్ని మనం రక్షించడం అంటే, మనం ధర్మాన్ని ఆచరించడం అని అర్థం. 

సత్యంవద ధర్మంచర అంటారు గదా! అసలు ఇతర ప్రాణుల నుండి మనిషిని వేరు చేస్తున్న లక్షణం (గుణం) ధర్మమే కదా! ధర్మమే విశ్వశాంతిని పరిరక్షించే పరమ సాధనం, శాశ్వత సూత్రం! ప్రపంచంలో శాంతిసామరస్యాలు నెలకొల్పడానికి ధర్మసంస్థాపనే ఏకైక పరిష్కారం! 

ఈ సందర్భంగా, గౌరవనీయులైన మన పూర్వ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం గారు యూరోపియన్ పార్లమెంట్ లో చెప్పిన మాటలు ప్రస్తావించడం ఎంతైనా సముచితం: ప్రపంచంలో నేటి కల్లోల పరిస్థితుల్లో ఇప్పుడు మనకు వుండవలసిన ఒక గొప్ప గుణం (లక్షణం) ఏమిటంటే – ‘ధర్మము!’ మానవ ప్రవర్తన లోని పరిపూర్ణత్వానికీ, నిత్యమైన మంచి తనానికీ వాహకమైనది – ‘ధర్మం! ‘

ఏ హృదయంలో అయితే ధర్మం వుంటుందో-ఆ వ్యక్తి ప్రవర్తనలో సౌందర్యం వుంటుంది,               

ఎప్పుడైతే ప్రవర్తన లో సౌందర్యం వుంటుందో-ఆ గృహంలో సామరస్యం వుంటుంది,                                  

ఎప్పుడైతే గృహంలో సామరస్యం వుంటుందో-దేశంలో శాంతి భద్రతలుంటాయి,               

ఎప్పుడైతే దేశంలో శాంతి భద్రతలుంటాయో- ప్రపంచంలో శాంతి పరిఢవిల్లుతుంది.                                          

కాబట్టి ప్రపంచశాంతికి అసలు మూలం ధర్మమే! 

కార్య కారణ సంబంధంలో   ప్రపంచశాంతి కార్యమైతే, ధర్మం కారణం అవుతుంది

పై మాటలను పరిశీలిస్తే, ముందు, మనిషి హృదయంలో ధర్మం వుంటే – ప్రపంచశాంతి కి సరియైన మార్గం ఏర్పడుతుంది – అని మనకు అర్థమవుతున్నది! అందువలన, మానవ ప్రవర్తన లో ధర్మాన్ని ప్రతిష్ఠించడమే ప్రపంచశాంతి కి అసలైన పరిష్కారం! 

ఈ నేపథ్యంలో, తత్వవేత్త అయిన మన దేశ ప్రథమ ఉపాధ్యక్షుడు & ద్వితీయ అధ్యక్షుడు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ (సెప్టెంబర్ 5న ఆయన పుట్టినరోజు  ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం) గారి మాటలు గుర్తుకొస్తున్నాయి: విద్య యొక్క ఉద్దేశం/అంతిమ లక్ష్యం – ఒక గొప్ప మనిషిని తయారు చేయడం. స్వేచ్చ, సృజనాత్మకత గల ఆ మనిషి – ప్రకృతి వైపరీత్యాలనూ, చారిత్రక క్లిష్ట పరిస్థితులనూ సమర్థవంతంగా ఎదుర్కొనగలవాడై వుండాలి. 

పై నేపథ్యంలో… 

కె. వేంకట నాగ రాజా రావు అనబడే నేను విశ్వ శాంతి సాధన కు నిబద్ధుడనైై  విద్యార్థులకూ, యువతకూ జ్ఞానోదయం కలిగిస్తూ, సాధికారత ను అందిస్తూ అంకితభావంతో సదా సేవ లందిస్తున్నాను. జ్ఞాన సముపార్జన & జ్ఞానాన్ని పంచుకోవడం అంటే నాకు మిక్కిలి ఆసక్తి! అందులోనూ, భగవద్గీతా జ్ఞాన యజ్ఞమంటే మరీ ప్రీతి! 

భగవద్గీత మనిషి జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలకూ పరిష్కారాలను ఇస్తుంది అని అంటారు – జగద్గురువు, నవీన దత్తావతారమైన పరమ పూజ్య శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు –  కరోనా కల్లోల సమయంలో, ప్రపంచశాంతి కోసం, అనితర సాధ్యమైన రీతిలో, విశిష్టమైన శైలిలో, శ్రీ వేదవ్యాస విరచితమైన సంపూర్ణ  శ్రీ మహా భారతాన్ని, మూలం నుండీ ప్రవచిస్తున్న  సందర్భంగా, భగవద్గీతా జ్ఞానబోధ చేస్తూ! అది ఒక  ప్రబోధ గీత! ఆయన ఒక దివ్య జ్ఞాన గంగా ఝరి !

గొప్పదైన ఆ భగవద్గీత ఒక ప్రశ్న తో ప్రారంభం అవుతుంది…  తదుపరి, అర్జునుడు అడిగిన ప్రతి ప్రశ్నకీ సంతృప్తికరమైన సమాధానాలు ఇస్తూ, గొప్పజ్ఞానాన్ని బోధించి, అర్జునుడ్ని కర్తవ్యోన్ముఖుడ్ని చేసి, యుద్ధం చేయించి, జయం కలిగించి, ధర్మసంస్థాపన చేశాడు –  భగవానుడైన శ్రీ కృష్ణుడు. 

ఇక ప్రస్తుత విషయానికి వస్తే, 

బ్లిస్ గీత కూడా యువతకు జయం కలిగిస్తూ, సాధికారతను ఇస్తుంది. విద్యార్థులు నన్ను అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తూ, అన్వేషిస్తూ, ఆవిష్కరణ అయినదే  బ్లిస్ గీత (సచ్చిదానంద గీత).  

ఆ విధంగా, ప్రపంచ శాంతి కోసం ధర్మ ప్రబోధం తో ఆవిర్భవించింది బ్లిస్ గీత (సచ్చిదానంద గీత)! ‌ 

నా ఈ చిరు ప్రయత్నం మీ అందరి ఆదరాభిమానాలను పొందగలదన్న నమ్మకంతో, మీ ఆశీస్సుల కోసం ప్రార్థిస్తున్నాను … 

ఓం శాంతిః శాంతిః శాంతిః